: వరకట్న వేధింపుల ఆరోపణలతో ఒడిశా న్యాయశాఖ మంత్రి రాజీనామా
ఒడిశా న్యాయశాఖ మంత్రి రఘునాథ్ మొహంతి రాజీనామా చేశారు. తనపై వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారని కోడలు బర్షాసోనీ మొహంతి.. మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులపై బాలాసోర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మొహంతి పదవి నుంచి తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అందజేశారు.