: ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రజనీకాంత్ చదువుకున్న పాఠశాల!


సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు చదువుకున్న గవిపురమ్ 'గవర్నమెంట్ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్' కర్ణాటక ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. ఎన్నో ఏళ్ల ఆ పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థలో ఉండటంతో, బాగుచేయాలని అభిమానులు సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి పాఠశాల పరిస్థితి దారుణంగా ఉందని 'కర్ణాటక రజనీజీ సేవా సమితి' ఉపాధ్యక్షుడు ప్రకాష్ గౌడ తెలిపారు. దాంతో, వివిధ తరగతుల్లోని వందల మంది విద్యార్థులు ప్రస్తుతానికి వేరేచోట క్లాసులు చెప్పించుకుంటున్నారని వివరించారు. ఈ నెల 21లోగా ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని వెల్లడించారు. ఇది ప్రభుత్వ పాఠశాల అయినా కొంత సాయం తాము అందిస్తామని చెప్పారు. కాబట్టి, పాఠశాలను బాగు చేయించమని కర్ణాటక ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు.

  • Loading...

More Telugu News