: తెలంగాణ తల్లి రూపంలో సోనియా విగ్రహం!
తెలంగాణ ప్రక్రియను మరింత వేగవంతం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విగ్రహ రూపంలో కృతజ్ఞత చెప్పబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ తల్లి రూపంలో ఉన్న సోనియా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కంకణం కట్టుకున్న ఆయన... కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరుకు చెందిన విగ్రహ శిల్పి ప్రసాద్ కు విగ్రహ తయారీ పనిని అప్పగించారు. ఈ నేపథ్యంలో శిల్పి తయారుచేసిన విగ్రహ మట్టి నమూనాను తన కుటుంబ సభ్యులతో వెళ్లి నిన్న (మంగళవారం) పరిశీలించారు. దానికి ఓకే చెప్పిన శంకర్రావు అదే తరహాలో కాంస్య విగ్రహం తయారుచేయమని ఆర్డరిచ్చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని తమ వ్యవసాయ క్షేత్రంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మీడియాకు తెలిపారు.