: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పదవి: కేటీఆర్


తమ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆగ్రహం, ఆక్రోశం వెళ్లగక్కారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో తెలుగుదేశం కుమ్మక్కు కావడం వల్లే అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు.

కాంగ్రెస్, టీడీపీ కలిసి త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాయని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ తో టీడీపీ కుమ్మక్కు కాకపోతే అవిశ్వాసంపై ఓటింగ్ కు మద్దతు తెలపాలని కోరారు. 

  • Loading...

More Telugu News