: బిల్లుపై చర్చించని వారిపై పోరాటం చేస్తాం: అశోక్ బాబు
అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ జరగాల్సిందేనని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా చర్చను పూర్తి చేయాలని ఆయన కోరారు. దీనికి విరుద్ధంగా సభను వాయిదా వేసుకుంటూ పోతే, సమైక్య రాష్ట్రం నిలబడదని అన్నారు. చర్చ జరగకుండా అడ్డుకునే ప్రజాప్రతినిధులే లక్ష్యంగా పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. బిల్లుపై చర్చిస్తే విభజనకు అంగీకరించినట్టు కాదని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.