: విభజనను వ్యతిరేకిస్తున్నాను: వట్టి


విభజన బిల్లును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. శాసనసభలో బిల్లుపై చర్చను ఆయన ప్రారంభిస్తూ కేంద్రం పంపిన బిల్లు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రూపొందించినదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల రెండు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశమే కాకుండా.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య విభేదాలు, విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. నీరు, విద్యుత్, వనరులు, ఉద్యోగాలు, నిధులు వంటి అంశాల్లో రెండు ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని, అందుకే తాను ఈ బిల్లును ఏ రకంగానూ సమర్థించడం లేదని ఆయన అంటుండగానే సభ వాయిదా పడింది.

  • Loading...

More Telugu News