: అదో కోటి..ఇవో మూడున్నర లక్షలు... తడిసి మోపెడు!


సిరిసిల్ల వస్త్రవ్యాపారుల దగ్గర్నుంచి కోటి రూపాయల వస్త్రం తీసుకుని ఓ వస్త్ర వ్యాపారి ఉడాయించాడు. వాడిని పట్టుకునేందుకు మరో మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో వస్త్ర వ్యాపారులు కోటి రూపాయల వస్త్రం, మోసగాడి కోసం ఖర్చు పెట్టిన మూడున్నర లక్షలు నష్టపోవాల్సిందేనా? అంటూ వాపోతున్నారు. వివరాల్లోకెళితే.. కేతన్ జైన్ అనే వస్త్ర వ్యాపారి తనది ఢిల్లీ అని చెప్పి సిరిసిల్ల వస్త్ర వ్యాపారుల నుంచి వస్త్రాలు తీసుకుని నాలుగు నెలలు క్రమం తప్పకుండా నగదు పంపిణీ చేశాడు. నమ్మకం కుదిరాక పాతిక మంది వస్త్ర వ్యాపారుల దగ్గర అప్పుగా కోటి రూపాయల విలువ కలిగిన వస్త్రాలు తీసుకుని ఉడాయించాడు.

దీంతో ఫోన్ నెంబర్ల ఆధారంగా అతనిది రాజస్థాన్ లోని జోథ్ పూర్ అని పోలీసులు గుర్తించారు. దీంతో సిరిసిల్ల టౌన్ సీఐ యోగేంద్ర ఒక టీఆర్ఎస్ నేతతో కలసి అతడ్ని పట్టుకునేందుకు రాజస్థాన్ వెళ్లారు. అతడి ఇంటిని, పిల్లలు చదివే స్కూలును గుర్తించారు. అనంతరం అక్కడే పదిరోజులు ఉండి గాలించినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే మహారాష్ట్ర, రాజస్థాన్ లలో అతడి అన్వేషణకు అయిన ఖర్చు మూడున్నర లక్షల రూపాయలు. ఈ మొత్తం కూడా వ్యాపారుల దగ్గర వసూలు చేసినదే. దీంతో అతడు దొరుకుతాడు, డబ్బులు వస్తాయని ఆశించిన వ్యాపారులకు ఆందోళనే మిగిలింది.

  • Loading...

More Telugu News