: ఫిల్మ్ ఛాంబర్ లో ఉదయ్ కిరణ్ సంతాప సభ
హైదరాబాదులోని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ లో నటుడు ఉదయ్ కిరణ్ సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నటి జీవిత, శివాజీ రాజా, పరుచూరి బ్రదర్స్ తదితరులు హాజరయ్యారు.