: నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు: నాగార్జున
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతకు గురికాలేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున తెలిపారు. తన తండ్రి అనారోగ్యంపై వస్తున్న కథనాలన్నీ పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. కొంత కాలం క్రితం క్యాన్సర్ బారిన పడ్డట్టు అక్కినేని స్వయంగా మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి వైద్యమందిస్తున్నట్టు పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయన అభిమానులు అందోళన చెందారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రకటించారు.