: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కార్యాలయంపై దాడి


ఢిల్లీ కౌషంభిలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై శ్రీరామ్ సేన మద్దతుదారులు రాళ్ల దాడికి దిగారు. కాశ్మీర్ పై ఆ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే ఈ దాడికి పాల్పడినట్లు ఆందోళనకారులు తెలిపారు. దాడితో కార్యాలయ అద్దాలు పగిలిపోగా, చిన్న చిన్న వస్తువులు పాడయ్యాయి. ఈ సమయంలో కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, దాడిలో ఎవరికీ గాయాలవలేదు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News