: మావటీల కోసం ఏనుగుల నిరాహారదీక్ష!
ఒకరి కోసం బెంగ పెట్టుకుని అన్నం తినడం మానేయడాన్ని చాలా మందిలో చూస్తూనే ఉంటాం. కానీ, తమ బాగోగులు చూసుకునే మావటీలు కనిపించకపోయేసరికి రెండు ఏనుగులు బాధతో ఆహారం తినడం మానేశాయి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ననియాల వద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే జయంత్, గణేశ్ అనే రెండు ఏనుగులు గత మూడు రోజులుగా ఏమీ తినకుండా బెంగతో కన్నీరు కారుస్తున్నాయి. 2006లో తిరుపతి నుంచి వీటిని ఇక్కడకు తీసుకొచ్చారు. వాటితోపాటు నలుగురు మావటీలు కూడా వచ్చారు. ఏన్నో ఏళ్లుగా వీటి సంరక్షణ బాధ్యతలు చూసిన మావటీలు తిరుపతికి బదిలీ అయ్యారు. దీంతో ఏనుగులు బెంగపెట్టుకున్నాయి.