: సమైక్యవాదులైతే సభలో చర్చకు సహకరించండి: పనబాక లక్ష్మి
సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు నిజంగా సమైక్యవాదులైతే సభలో చర్చకు సహకరించాలని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. అంతేకానీ, పోడియంను చుట్టుముట్టి చర్చ జరగకుండా అడ్డుకోవడం సరికాదని గుంటూరులో సూచించారు. కాగా, బాపట్లలో కులం పేరుతో బహిరంగ దూషణలకు దిగుతున్న గెజిటెడ్ అధికారులపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.