: గంటపాటు వాయిదా పడ్డ శాసనమండలి
ఈ రోజు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయిన వెంటనే సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభకు మంత్రులెవరూ హాజరుకాకపోవడంతో, అన్ని పక్షాల ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అనంతరం సభలో జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. దీంతో, యథాప్రకారం మండలి ఛైర్మన్ చక్రపాణి సభను గంటపాటు వాయిదా వేశారు.