: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత


ప్రముఖ మావోయిస్టు నేత, దండకారణ్య స్పెషల్ జోన్ అధికార ప్రతినిధి గుమ్మడివెల్లి వెంకటకృష్ణ ప్రసాద్ అలియాస్ గూడ్సా ఉసెండి పోలీసులకు లొంగిపోయాడు. ఉసెండి తన భార్య రాజీతో పాటు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)కి నిన్న రాత్రే లొంగిపోయినట్టు సమాచారం. ఇతనిపై రూ. 15 లక్షల రివార్డు ఉంది. ఉసెండి స్వగ్రామం వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి. మావోయిస్టు పార్టీలో అతను సుఖ్ దేవ్ పేరుతో ఎక్కువగా చెలామణి అయ్యాడు. రెండేళ్ల క్రితం మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ ఎన్ కౌంటర్ తర్వాత ఉసెండి కీలక నేతగా మారాడు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్ గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News