: థానే వద్ద డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు: 9 మంది మృతి


మహారాష్ట్రలోని థానే వద్ద డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఎస్-3, ఎస్-4, ఎస్-5 బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 19019 నంబరు గల ఈ ట్రైన్ డెహ్రాడూన్ నుంచి ముంబయి వెళుతుండగా థానేలోని ధాను రైల్వేస్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ఢిల్లీ-లక్నో శతాబ్ధి ఎక్స్ ప్రెస్ లో కూడా స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ట్రైన్ ను గజియాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

  • Loading...

More Telugu News