: కుక్కే కదా అని ముద్దుచేస్తే...


మన కుక్కేకదా... అని తెగ ముద్దుచేస్తే... చేతివేలికున్న ముద్దుటుంగరాన్ని మింగేసిందట. దీంతో పాపం రెండురోజుల పాటు కుక్క ఎప్పుడు మలవిసర్జన చేస్తుందా... అని కాచుక్కూర్చున్న దాని యజమానురాలు చివరికి దాని మలంలో ఉంగరం లభించడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. బ్రిటన్‌లోని దెవాన్‌లో యాంగీకొల్లిన్స్‌ అనే మగువ చేతి గోళ్లను శుభ్రం చేసుకునేందుకుగానూ చేతి వేలికున్న పెళ్లి ఉంగరాన్ని తీసి కిచెన్ లో పెట్టింది. ఆ వజ్రపుటుంగరం విలువ సుమారుగా రూ.18 లక్షలు. తీరా తన పని పూర్తయిన తర్వాత వంటింట్లోకి వెళ్లి చూస్తే ఉంగరం దాని స్థానంలో లేదు. మొత్తం గదంతా వెదికినా కూడా ఉంగరం కనిపించలేదు. చివరికి తాను ప్రేమగా పెంచుకుంటున్న కుక్క దాన్ని మింగేసి ఉంటుందని భావించిన యాంగీ కొల్లిన్స్‌ ఇక అప్పటినుండీ కుక్క ఎప్పుడు మలవిసర్జన చేసినా దాన్ని పరీక్షిస్తూ కూర్చుంది. ఇలా రెండు రోజులపాటు యజమానురాలిని కంగారుపెట్టించిన శునకం రెండోరోజు మలవిసర్జన చేసినప్పుడు సదరు ఉంగరం అందులో బయటపడిరది. దీంతో యాంగీకి ఆనందం కలిగింది.

  • Loading...

More Telugu News