: ధ్యానంతో చక్కటి ఆరోగ్యం


రోజూ కాసేపు ధ్యానం చేస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని ఎప్పటినుండో నిపుణులు సూచిస్తున్నారు. అయినా మనం మాత్రం ధ్యానం పైన మనసును లగ్నం చేయలేకున్నాం. కానీ ధ్యానం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనలోని ఆందోళన, కుంగుబాటు దూరమవుతాయని మరోసారి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజూ కనీసం అరగంటపాటు ధ్యానం చేయడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని, మనలోని కుంగుబాటు, ఆందోళన దూరమవుతాయని శాస్త్రవేత్తలు ప్రత్యేక అధ్యయనం ద్వారా గుర్తించారు.

నిజానికి ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అనే విషయాన్ని అనాదినుండి మనదేశంలో చెబుతున్నా దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. కానీ దీనిపై పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు ధ్యానంతో బోలెడంత ప్రశాంతత లభిస్తుందని మరోమారు చెబుతున్నారు. ధ్యానం చేయడం అనేదాన్ని ప్రధాన వైద్య చికిత్సలో భాగంగా ఎవరూ పరిగణించడం లేదని, కానీ తమ అధ్యయనంలో ధ్యానం ద్వారా ఆందోళన, కుంగుబాటు వంటి లక్షణాలనుండి ఉపశమనం లభిస్తుందని గుర్తించినట్టు జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాధవ్‌ గోయల్‌ తెలిపారు. పరిశోధకులు కుంగుబాటు నిరోధక మందులతో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైన ఫలితాలతో సమానంగా తమ అధ్యయనంలో కూడా ఫలితాలు వచ్చినట్టు గోయల్‌ చెబుతున్నారు. 2013 జూన్‌లో 3,515 మందిపై చేపట్టిన 47 క్లినికల్‌ ట్రయల్స్‌ను వీరు పరిశీలించారు. మైండ్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన్‌ అనే ధ్యాన ప్రక్రియను అనుసరించిన వారిలో ఆందోళన, కుంగుబాటు వంటి లక్షణాల విషయంలో మంచి ఫలితాలు కనిపించాయని, దీనివల్ల ఎలాంటి నష్టమూ కలగలేదని గోయల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News