: ఈ స్క్రీన్‌ వెరీ స్మార్ట్‌ గురూ!


ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా టచ్‌ స్క్రీన్‌ ఫోన్‌లు చకచక కదులుతున్నాయి. అయితే ఇలాంటి టచ్‌ స్క్రీన్‌లపైకి మన చేతుల ద్వారానో మరేదైనా కారణాలవల్లో బ్యాక్టీరియా చేరుతుంది. ఇలాంటి వాటివల్ల పలురకాలైన అలర్జీలు వచ్చే అవకాశముందని ఒకవైపు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా చేరకుండా ఉండే విధంగా ఒక సరికొత్త టచ్‌స్క్రీన్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ స్క్రీన్‌ తనపై బ్యాక్టీరియా చేరకుండా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రపంచంలో తొలిసారిగా సూక్ష్మజీవి నాశక టచ్‌స్క్రీన్‌ను అమెరికాకు చెందిన కార్నింగ్‌ సంస్థ రూపొందించింది. ఈ తెరలను అయానిక్‌ సిల్వర్‌ అనే సూక్ష్మజీవి నాశక పదార్ధం చేర్చిన గొరిల్లాగ్లాస్‌ను ఉపయోగించి తయారుచేసినట్లు ఈ సంస్థ చెబుతోంది. ఈ కారణంగా ఈ స్క్రీన్‌పై బాక్టీరియా, బూజు, శిలీంధ్రాలు వంటివి దరిచేరవు. వీటిని కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంతర్జాతీయ వినియోగ ఎలక్ట్రానిక్‌ వస్తు ప్రదర్శనలో ఈ సరికొత్త టచ్‌స్క్రీన్‌ను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News