: మంచు ధాటికి అమెరికాలో నిలిచిన 3700 విమాన సర్వీసులు


మంచు తుపాను ధాటికి అమెరికాలో 3700 విమానసర్వీసులు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా అమెరికాను మంచుతుపాను ముంచెత్తుతోంది. దీని ప్రభావానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. న్యూయార్క్, ఎలినాయిస్, షికాగోల్లో మంచు తుపాను, చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. సాధారణంగా క్రిస్మస్ సీజన్ చివర్లో దీని ప్రభావం అధికంగా ఉండి జనవరి నాటికి కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ ఏడాది మంచు మరింత తీవ్రరూపం దాల్చిందని సమాచారం.

  • Loading...

More Telugu News