: సల్మాన్ ఖాన్ కేసును వాయిదా వేసిన కోర్టు


నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసును ముంబైలోని సెషన్స్ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ కేసులో తాజా విచారణకు ఆదేశించడంపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు తమకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ లాయర్ కోరడంతో జడ్జి డీడబ్ల్యూ దేశ్ పాండే వాయిదాకు అంగీకరించారు. ఈ మేరకు మహారాష్ట్ర లా అండ్ జ్యుడీషియరీ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు న్యాయవాది జేవి కేంద్రాల్కర్ న్యాయస్థానానికి సమాచారం అందించారు. ప్రస్తుతం వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News