: యశ్ బిర్లా గ్రూపు కంపెనీలపై ఐటీ దాడులు
యశ్ బిర్లా గ్రూపుకు చెందిన ఐదు కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ముంబయి, ఢిల్లీలోని కంపెనీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 నుంచి 20 ప్రాంతాలు, గ్రూపు అధికారుల నివాసాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాలపై ఓ స్పష్టత రావాలంటే దాదాపు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని, ఈ సమయంలో ఏవైనా సీజ్ చేయవచ్చని టాక్స్ లాయర్ తెలిపారు.