: 11వ తేదీన కేజ్రీవాల్ ను కలుస్తున్నాం: లోక్ సత్తా
రానున్న ఎన్నికల్లో ఏఏపీతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగుతామని లోకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నేపథ్యంలో లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తమ పార్టీ నేతలతో కలసి ఈ నెల 11న ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ కానున్నారని చెప్పారు. ఈ రోజు కడపలో మీడియాతో మాట్లాడుతూ కఠారి ఈ వివరాలను వెల్లడించారు.