: ముగిసిన కోదండరాం సంపూర్ణ తెలంగాణ దీక్ష


హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం చేపట్టిన 'సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష' ముగిసింది. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, విభజన బిల్లును ఆపేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బిల్లుకు సవరణ పెడితే ఓటింగ్ ను ఆమోదించే పరిస్థితి లేదన్నారు. బిల్లును ఆపి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టొద్దన్నారు. గవర్నర్ నుంచి శాంతి భద్రతల అధికారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. విభజన తర్వాత ఉమ్మడి హైకోర్టు కాకుండా రెండు హైకోర్టులు ఉండేలా సవరణలు చేయాలని సూచించారు. ఈ దీక్షలో పలువురు జేఏసీ నేతలు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News