: ఐపీఎల్ గురించి ఆలోచించడం లేదు: 36 బంతుల్లో సెంచరీ హీరో
ఐపీఎల్ లో స్థానం గురించి ఆలోచించడం లేదని వన్డేల్లో 36 బంతుల్లో సెంచరీ చేసిన తాజా సంచలనం కోరీ అండర్సన్ తెలిపాడు. న్యూజిలాండ్ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవడమే తన ముందున్న లక్ష్యమని అండర్సన్ తెలిపాడు. భారత్ తో జరుగనున్న సిరీస్ లో రాణించి జట్టులో తన స్థానాన్ని పదిలపరచుకుంటానని అన్నాడు. ఈ సిరీస్ లో రాణిస్తే జట్టులో తన స్థానంపై సగం సక్సెస్ అయినట్టేనని అండర్సన్ అభిప్రాయపడ్డాడు.