: చర్చను వ్యతిరేకిస్తే విభజనకు అంగీకరించినట్టే: శైలజానాథ్
సభలో టీబిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... చర్చ సమయంలో సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చని మంత్రి శైలజానాథ్ తెలిపారు. వైఎస్సార్సీపీ, సీమాంధ్ర టీడీపీ నేతలు చర్చను వ్యతిరేకిస్తున్నారని... చర్చను వ్యతిరేకిస్తే విభజనకు అంగీకరించినట్టేనని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లులో లేని ఆర్థిక వివరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని... అక్కడ నుంచి సమాచారం వచ్చాక సభ్యులకు అందిస్తామని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం శాసనసభను, మండలిని వాడుకోరాదని హితవు పలికారు.