: ఆసుపత్రి నుంచి శృతి హసన్ డిశ్చార్జ్
హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్న నటి శృతి హసన్ డిశ్చార్జ్ అయింది. ఈ విషయాన్ని శృతినే తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'అభిమానులు చూపించిన ప్రేమకు, నేను త్వరగా కోలుకోవాలని తెలిపిన విషెస్ కు చాలా కృతజ్ఞతలు. అపెండిక్స్ నుంచి బయటపడ్డాను. ఇక చిన్నగా కోలుకుంటాను' అని తెలిపింది. రెండు రోజుల కిందట హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరైన శృతి తిరిగి కారులో వెళుతున్న సమయంలో కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.