: కొడుకు ఆళగిరికి కరుణానిధి వార్నింగ్!
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో డీఎమ్ కె అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారులు అళగిరి, స్టాలిన్ మధ్య వివాదం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన కరుణ.. పార్టీని వ్యతిరే్కిస్తే క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని ఓ తమిళ చానల్ ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇచ్చారు. అయితే, డీఎమ్ కే ను నిన్న, నేడు, రేపు కూడా తానే నడుపుతానని తెలిపారు. ఓ వర్గం మీడియా డీఎమ్-డీఎమ్ డీకే కూటమి మధ్య కొన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందంటూ అళగిరి ఈ ప్రకటనలు చేసినట్లయితే వాటికి తమ పార్టీది బాధ్యత కాదని కరుణ చెప్పారు.