: చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉదయ్ కిరణ్ అభిమానులు
యువనటుడు ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఈఎస్ఐ శ్మశానవాటికలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ అభిమానులు చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా అడ్డుకున్నది చిరంజీవి కుటుంబమేనని, ఉదయ్ కిరణ్ మృతికి పరోక్షంగా చిరంజీవే కారణమని అతని అభిమానులు ఆరోపించారు.