: ఊటీ పరిసరాల్లో ఆందోళన రేపుతున్న చిరుత


ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందన్న వార్త ఆందోళన రేపుతోంది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు వెల్లువెత్తే ఊటీలో చిరుత సంచరిస్తోందన్న వార్తతో పర్యాటకులు, స్థానికులు ఇళ్లు వదలడం లేదు. కలపకోసం అడవిలోకి వెళ్లిన వ్యక్తి చిరుత బారిన పడి మృతిచెందాడు. సగం తిని వదిలేసిన అతని శరీరాన్ని అటవీశాఖాధికారులు గుర్తించారు. గత వారం ఓ మహిళ శవాన్ని కూడా ఇలాంటి పరిస్థితిలోనే గుర్తించారు. దీంతో రంగప్రవేశం చేసిన అటవీశాఖాధికారులు నాలుగు పంజరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ చిరుత సంచారం కనపడడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News