: ఢిల్లీ జల్ బోర్డులో భారీ బదిలీలు చేపట్టిన కేజ్రీవాల్ సర్కార్


ఢిల్లీ జల్ బోర్డులో ఎనిమిది వందల మంది ఉద్యోగులను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాత్రికి రాత్రే ఆదేశాలు కూడా జారీ అయినట్లు సమాచారం. నీటి పంపిణీ వినియోగం, దాని సేవలు మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ముగ్గురు బోర్డు అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అటు బదిలీ అయిన వారందరూ రాజధానిలోని 25 నీటి అత్యవసర పాయింట్లలో నియమించబడతారు. ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను బదిలీ చేయడం సంస్థ చరిత్రలోనే తొలిసారని అంటున్నారు. ఢిల్లీ జల్ బోర్డులో నీటి మాఫియాను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాక కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బోర్డుకు కోత్త సీఈవో విజయ్ కుమార్ ను నియమించి, పై చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News