: వ్యక్తిగత లాభాలకోసమే నాతో అందరూ పని చేశారు: లేడీ గాగా
గతేడాది హిప్ గాయంతో శస్త్ర చికిత్స చేయించుకున్న 27 ఏళ్ల పాప్ స్టార్ లేడీ గాగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సొంత ప్రయోజనాల కోసం తనను ఉపయోగించుకున్న వారంతా నకిలీ స్నేహితులేనని అంటోంది. తాను నమ్మి, ప్రేమించిన వారంతా, దగ్గరగా పనిచేసిన వారంతా వ్యక్తిగత లాభాల కోసమే చేశారని.. దాంతో, తన హృదయం తీవ్రంగా గాయపడిందని ఓ వెబ్ సైట్ లో గాగా పోస్ట్ చేసింది. తను బాగా ఉన్నప్పుడు తనతో ఉన్నవారు.. తనకు ఆపరేషన్ జరిగాక ఆసుపత్రిలో ఎవరూ లేరని బాధ వ్యక్తం చేసింది. దీనిద్వారా ఓ గొప్ప గుణపాఠం నేర్చుకున్నానని గాగా తెలిపింది.