: రాష్ట్రంలో వేడెక్కుతున్న వాతావరణం


ఈ ఏడాది అప్పుడే ఎండలు మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో కొన్ని చోట్ల సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడే ఇలా వుంటే వేసవి గడిచే కొద్దీ ఎండలు మరెంత మండిస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా నిన్న రాష్ట్రంలో కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం పట్టణంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరడంతో ప్రజలు వేసవితాపానికి తల్లడిల్లారు.

రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల కూడా 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, తెలంగాణాలోని కొన్ని చోట్ల మాత్రం వాతావరణం కాస్త చల్లగా వుంది. రాబోయే 24 గంటల్లో ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాదు నగరంలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని అంటున్నారు.

  • Loading...

More Telugu News