: ఉదయ్ కిరణ్ ఆరేళ్ల క్రితమే మరణించాడు.. ఈ రోజు తెలిసింది: విజయచందర్
ఉదయ్ కిరణ్ ఈ రోజు చనిపోలేదని... ఆరేళ్ల క్రితమే చనిపోయాడని, అయితే ప్రపంచానికి మాత్రం ఈ రోజు తెలిసిందని ప్రముఖ నటుడు విజయచందర్ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ లో ఉదయ్ మృత దేహానికి నివాళి అర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటన ద్వారా సినిమా ప్రపంచం మొత్తం నేర్చుకోవాల్సింది చాలా ఉందని సూచించారు. సినీ పరిశ్రమలో మార్పురావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.