: ఉస్మానియా వర్శిటీలో ఉద్రిక్తత


ఉస్మానియా వర్శిటీ క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం శాసనసభ రెండు పర్యాయాలు వాయిదా పడిన విషయం విదితమే. శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై వెంటనే అసెంబ్లీలో చర్చ జరపాలంటూ ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను ఎన్.సి.సి. గేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను నిలువరించేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ర్యాలీని ముందుకెళ్లనీయాలంటూ విద్యార్థులు ఆగ్రహంతో పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు.

  • Loading...

More Telugu News