: కోదండరాం సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ప్రారంభం
తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ బిల్లులో పలు సవరణలు కోరుతూ రాజకీయ జేఏసీ ఈ దీక్షకు పిలుపునిచ్చింది. దీక్షలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఉద్యమసంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.