: ఎర్రగడ్డ శ్మశాన వాటికకు ఉదయ్ కిరణ్ భౌతికకాయం తరలింపు
సినీ హీరో ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ నుంచి ఎర్రగడ్డ శ్మశాన వాటికకు తరలించారు. ఆయన పార్థివదేహంతో పాటు కుటుంబ సభ్యులు, పలువులు అభిమానులు ఉన్నారు. అంతకు ముందు ఫిలిం ఛాంబర్ లో దాదాపు రెండు గంటల పాటు ఉదయ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఉదయ్ ను చివరిసారిగా దర్శించుకున్నారు.