: ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులకు లష్కరే తోయిబా గాలం!


గతేడాదిలో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన అల్లర్లు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. అల్లర్ల బాధితులైన వేలమంది ఇప్పటికీ సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, వీరిని తమ పనులకోసం ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, సున్నితమైన ప్రాంతాల్లో చొరబాటుకు యత్నిస్తోందని సమాచారం. హర్యానాలో ఇటీవల అరెస్టయిన ఇద్దరు ముస్లిం మత గురువులను ఢిల్లీ పోలీసులు విచారించినప్పుడు లష్కరే ఉగ్రవాదులతో తమకున్న సంబంధం గురించి వెల్లడించారు.

ఇటీవల ముజఫర్ బాధితులను కలుసుకున్నారని, చర్చలు కూడా జరిపారని తెలిపారు. భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల కోసమే ముజఫర్ నగర్ బాధితులను లష్కరే రిక్రూట్ చేసుకోవాలనుకున్నట్లు వివరించారు. ఈ విషయాలను కొంతమంది ముజఫర్ నగర్ బాధితులు కూడా స్పష్టం చేశారు. అయితే, అందుకు తాము నిరాకరించినట్లు కూడా చెప్పారు.

  • Loading...

More Telugu News