: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా యెల్లెన్ నియామకానికి సెనేట్ ఓకే
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (కేంద్రీయ బ్యాంకు) చైర్మన్ గా యెల్లెన్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. అగ్రరాజ్యం కేంద్రీయ బ్యాంకుకు ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. అమెరికాలోనే గౌరవనీయ ఆర్థిక వేత్తగా యెల్లెన్ ను అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. ఆమె ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. దాంతో ప్రస్తుతమున్న బెన్ బెర్నాంకీ పదవి నుంచి తప్పుకోనున్నారు.