: 100 లోక్ సభ స్థానాలపై ఆమ్ ఆద్మీ కన్ను


లోక్ సభ ఎన్నికలకు గట్టిగా నాలుగే నెలల సమయం ఉన్నందున ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా మెట్రో నగరాలలోని స్థానాలపై దృష్టి పెట్టనుంది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు.. ఢిల్లీ విధానసభలో గెలుపంత సులువు కాదు. ఆమ్ ఆద్మీ గురించి ఇంకా అందరికీ పూర్తి స్థాయిలో తెలియదు. పైగా ఆ పార్టీకి సరైన కేడర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ప్రధానంగా ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలు, హర్యానాలో 10, ముంబై, థానేలో 7, బెంగళూరులోని 5 స్థానాలతో పాటు మరికొన్నింటిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 20 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News