: మందు బాటిల్ పెడితే తప్ప వెళ్లవా?: కేసీఆర్ ను నిలదీసిన మోత్కుపల్లి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆయన విలీనం చేయకపోవడం వల్లే విభజన ప్రక్రియ నెమ్మదించిందని ఆరోపించారు. సోనియా గాంధీ పిలిస్తే ఢిల్లీ వెళతానని కేసీఆర్ అంటున్నారని... మందుబాటిల్, పాయా పెడితేనే ఆయన వెళతారా? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ మాటలకు కట్టుబడి ఉన్నాయని... కేసీఆర్ మాత్రమే మాట తప్పాడని... మాట తప్పడం ఆయనకున్న అలవాటేనని దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలమందరం కేసీఆర్ కు లేఖ రాస్తామని... తమ భూములను లీజుకు తీసుకుని, ఎకరాకు లక్ష రూపాయలిచ్చి, 99 లక్షల రూపాయలను ఆయన్నే తీసుకోమని లేఖలో కోరతామని తెలిపారు.