: శాసనసభ ప్రారంభం .. గంటపాటు వాయిదా


శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగి సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. ఈ ఆందోళనల మధ్యే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సభను సజావుగా నిర్వహించడానికి సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకపోవడంతో, సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News