: ఉదయ్ కిరణ్ మృతదేహం నిమ్స్ నుంచి ఇంటికి తరలింపు


సినీ హీరో ఉదయ్ కిరణ్ మృత దేహాన్ని నిమ్స్ నుంచి ఈ రోజు ఉదయం శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం ఫిలింఛాంబర్ లో ఉదయం 10 గంటల నుంచి 11.45 వరకు ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల అనంతరం ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, ఆయన భౌతిక కాయాన్ని నిన్ననే నిమ్స్ నుంచి ఇంటికి, అనంతరం ఫిలిం ఛాంబర్ కు తరలించినట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు.

  • Loading...

More Telugu News