: బీహార్ లో తొలి రామాయణ్ యూనివర్శిటీ!
ప్రపంచ తొలి రామాయణ్ విశ్వవిద్యాలయాన్ని బీహార్ లోని వైశాలి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హిందూ మత ట్రస్ట్ ప్రణాళికలు వేస్తోంది. రామాయణంపై పరిశోధన చేసే ఓ ఆధునిక కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుందని మహవీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ తెలిపారు. పూర్తి ఆధునిక నిర్మాణంగా ఉండే ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు, పరిశోధన కోసం అన్ని మౌలిక సదుపాయాలు, ఆన్ లైన్ సౌకర్యం, వైఫై ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు వైశాలి జిల్లాలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలో భవనాన్ని పూర్తి చేస్తామని వివరించారు.