: జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా?


పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం ఛైర్మన్ పదవికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందట బెంగాల్ గవర్నర్ ఎమ్ కె నారాయణ్ ను రాజ్ భవన్ లో కలుసుకున్న ఆయన రాజీనామా లేఖ అందజేసినట్టు సమాచారం. న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు గంగూలీ కొన్ని నెలల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తనను బెంగాల్ హెచ్ఆర్ సీ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించకుండా ఆపాలని పెట్టుకున్న పిల్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దాంతో, గత్యంతరం లేక పదవినుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News