: దుబాయ్ లో జాక్ పాట్ కొట్టిన కేరళ టైలర్
కేరళ కు చెందిన ఫసలుద్దీన్ కుట్టి పాలక్కై అనే టైలర్ దుబాయ్ మెగా లాటరీ కొట్టాడు. 2014 దుబాయ్ షాఫింగ్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన రెండోరోజు లాటరీలో రెండు లగ్జరీ కార్లు, లక్ష దినార్ లు(రూ.16.9 లక్షలు) సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులు మాట్లాడుతూ, పది సంవత్సరాల నుంచి కుట్టి పాలక్కై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడని.. ఈసారి మూడు రోజుల కిందట అతనికి పుట్టిన బేబీ ఈ అదృష్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. పది సంవత్సరాలుగా దుబాయ్ లో నివసిస్తున్న తనకు, ఈసారి లాటరీ గెలుస్తానన్న నమ్మకం ఉందని కుట్టి పాలక్కై చెప్పాడు.