: వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం


ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో భర్తీ కానున్న గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పోస్టులు ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. 2011 లో చేపట్టిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీ ద్వారా ప్రభుత్వానికి పరీక్ష ఫీజు నిమిత్తం 38 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. గతంలో కంటే ఈసారి పోస్టులు ఎక్కువగా ఉండడం, ఉద్యోగాలకు పోటీతత్వం ఉండటంతో ఆదాయం ఎక్కువగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు పరీక్ష ఫీజు రుసుము గతంలో 200 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 300 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఫీజును 150 రూపాయలకు కుదించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 10 వేల మంది, ఇతర కులాల వారు 30 వేల మంది పైగానే దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో పరీక్ష ఫీజు ద్వారా 90 లక్షల రూపాయల పైగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News