: ఉదయ్ కిరణ్ మృతదేహం ఇంటికి తరలింపు.. రేపు అంత్యక్రియలు
నటుడు ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని నిమ్స్ నుంచి కొద్దిసేపటి కిందట కుటుంబసభ్యులు శ్రీనగర్ కాలనీలోని నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం రేపు ఉదయం పది గంటలనుంచి 11.30 గంటల వరకు ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఇ.ఎస్.ఐ. శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నారు. అంతకుముందు నిమ్స్ ఆసుపత్రి మార్చురీలో ఉన్న సోదరుడు మృతదేహాన్ని చూసేందుకు అతని సోదరి శ్రీదేవి వచ్చారు. ఆ వెంటనే అతడి దేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. విదేశాల్లో ఉన్న ఆమె ఉదయ్ మరణ వార్త తెలియగానే ఇక్కడికి వచ్చారు.