: ఒప్పంద కార్మికులకు కూడా మధ్యంతర భృతి ఇవ్వాలని కోరాం: కేటీఆర్


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ భేటీ ముగిసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ఒప్పంద ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని సీఎస్ ను కోరినట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. అయితే, లక్షలాది మంది ఒప్పంద కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News