: కర్నూలులో కలెక్టరేట్ ను ముట్టడించిన రైతులు.. ఫ్లెక్సీ దుమారం!


కేసీ కెనాల్ కు నీటి విడుదల నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు కర్నూలు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఎన్టీఆర్ కూడలిలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ రైతులు ఏర్పాటు చేసిన ఫ్టెక్సీ పెద్ద దుమారాన్ని రేపింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులను మహిళల రూపంలో చిత్రీకరించిన ఫ్లెక్సీపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఫ్లెక్సీ తీసేసేందుకు ప్రయత్నించడంతో తమ మనోభావాలు పట్టించుకోని ప్రజాప్రతినిధులును ప్రతిబింబించే ఫ్లెక్సీ తీయవద్దని పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు ఆ ఫ్లెక్సీ తొలగించి చించేశారు.

  • Loading...

More Telugu News