: నా పరిథిలో న్యాయం చేస్తానని చెప్పా: బొత్స
పాలెం బస్సు ప్రమాద బాధితులకు తన పరిథిలో న్యాయం చేస్తానని మాటిచ్చానని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సినీ నటుడు శివాజీ నేతృత్వంలో పాలెం బస్సు ప్రమాదబాధితులు ఈ ఉదయం ఆయనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ బాధితులు పరిహారం పెంచాలని, ఉద్యోగం కావాలని కోరారని అన్నారు. న్యాయం చేస్తానని చెప్పానని ఆయన తెలిపారు. బస్సు యజమానులపై చర్యలు తీసుకునే అధికారం ఆర్టీఏకి లేదన్న బొత్స, కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.